కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలోకనిగిరి ఎమ్మెల్యే , జిల్లా టిడిపి అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇటీవల జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబరిచిన కార్యకర్తలకు నారా లోకేష్ పంపిన ఉత్తమ కార్యకర్త అవార్డులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... టిడిపిలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అధిష్టానం గుర్తింపు ఇస్తుందన్నారు. ఉత్తమ కార్యకర్త అవార్డులు పొందిన వారికి భవిష్యత్తులో పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయానికి కృషి చేయాలని సూచించారు.