చేజర్ల మండలం ఆదురుపల్లి నుంచి వాగులేరు కండ్రిక వరకు అధికారులు జంగిల్ క్లియరెన్స్ పండ్లు చేపట్టారు. అయితే రోడ్డుకు రెండువైపులా ఉన్న చెట్లను పూర్తిగా నరికి వేయడంతో గ్రామస్తులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో టిడిపి ప్రభుత్వంలో NRGS పథకం కింద నాటిన చెట్లను ఇలా తొలగించడం తగదని కేవలం కొమ్మలను మాత్రమే తీయాలని గ్రామస్తులు సూచించారు. చెట్లను నరికి వేయడం పర్యావరణానికి హానికరమని వారు మండిపడ్డారు.