రాయదుర్గం: పట్టణంలో బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది : మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప
రాయదుర్గం పట్టణంలో వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన 'బాబు ష్యూరిటి మోసం గ్యారెంటీ' కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప అన్నారు. శుక్రవారం పట్టణంలోని 15,16 వార్డుల్లో పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ ఉన్నపుడే బాగుండేదని, ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు సక్రమంగా అందలేదని చెప్పారని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ శ్రీలక్ష్మి, శారద, లావణ్య పాల్గొన్నారు.