తాడేపల్లిగూడెం: పెంటపాడులో రెడ్డిసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పాపెంటపాడులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ ఆ రాముల వారి దయతో రాష్ట్రము దేశం ఎల్లప్పుడూ సుభిక్షాలతో వర్ధిల్లాలని కోరుకుంటూన్నట్లు తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఇదే విధంగా ఉండాలని, రామ రాజ్యం ఎల్లప్పుడూ మన ఆంధ్ర రాష్ట్రంలో విరజిల్లే విధంగా చూడాలన్నారు.