భీమవరం: శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో దసరా విజయీభవ బ్రోచర్ ఆవిష్కరణ
మన భారతీయ సంప్రదాయాలలో పండుగలు ఒక భాగమని శ్రీమావుళ్లమ్మ దేవస్థాన ఈవో మహాలక్ష్మి నగేశ్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 కు భీమవరం మావుళ్లమ్మ ఆలయంలో దసరా విజయీభవ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భావితరాలకు పండుగల విశిష్టతను తెలియజేసే విధంగా దసరా విజయీభవ కార్య క్రమాన్ని 32 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని దేవాలయాల్లో దసరా విజయీభవ యాత్ర నిర్వహిస్తామని నిర్వాహకులు రంగసాయి తెలిపారు.