కైకలూరు గుడివాడ రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నేపథ్యంలో ట్రాఫిక్ ని మళ్లించిన పోలీసులు
Eluru Urban, Eluru | Sep 24, 2025
కైకలూరు-గుడివాడ రైల్వే ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు కైకలూరు రూరల్ సీఐ రజిని కుమార్ తెలిపారు. ముదినేపల్లి నుంచి కైకలూరు వచ్చే వాహనాలు సింగరాయపాలెం మీదుగా, కైకలూరు నుంచి గుడివాడ వెళ్లే వాహనాలు మార్కెట్ యార్డ్ మీదుగా వెళ్లాలన్నారు. ఏలూరు నుంచి గుడివాడ వెళ్లే వాహనాలకు దెయ్యంపాడు మండపల్లి మీదుగా దారి మళ్లించినట్లు చెప్పారు. ప్రయాణికులు మార్పులను గమనించాలన్నారు.. దారులు మళ్లించే మార్గాల్లో భారీ గట్ల ఏర్పాటు చేసి పోలీస్ పికెట్ నిర్వహించినట్లు తెలిపారు