యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు పీడల్ కెనాల్ గండి, వరద నీటిలో మునిగిన పంట పొలాలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లోని కటకానిపల్లె వద్ద వెలుగొండ ప్రాజెక్టు పీడర్ కెనాల్ కు పలుచోట్ల గండి పడింది. ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు పడడంతో వరద నీరు ఫీడల్ కెనాల్ కు చేరుకుంది. వరద నీరు ఒత్తిడికి పలు ప్రాంతాల్లో గండిపడింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో మిరప అరటి పంటలు మునిగిపోయాయి. నీట మునిగిన పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.