హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టు బాధితులు ఆందోళన, చదరగొట్టిన పోలీసులు
జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం ఫార్మసిటీ బాధితులు, RRR ప్రాజెక్టు బాధితులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈరోజు నామినేషన్ చివరి రోజు కావడంతో బాధితులు భారీగా అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.