కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం ప్రజా వేదికలో 26 మంది బాధితులకు రూ.20 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం 26 మంది బాధితులకు రూ. 20 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలు పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందే ఉంటానన్నారు.