కుందుర్పమ్మ కొండను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దడానికి జిల్లా కలెక్టర్ ప్రణాళిక సిద్ధం చేశారని పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్వామి నాయక్ అన్నారు. కుందుర్పి మండల కేంద్రంలోని కుందుర్పమ్మ కొండను ఆదివారం ఆయన డ్వామా పీడీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఇక్కడికి వచ్చామన్నారు. ఇక్కడ పరిశీలించిన విషయాలను నివేదిక రూపంలో కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.