రాజానగరం: గంధం చెట్ల దొంగతనం కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దండం చెట్లను అపహరించిన కేసులో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను రాజానగరం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి మూడు లక్షల 50 వేల విలువ చేసే గంధం చెట్లను స్వాధీనం చేసుకున్నామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. నందరాడలో దొడ్డ సోమేశ్వరావు కు చెందిన 12 ఎకరాల తోటలో ఉన్న రెండు గంధం చెట్లను ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.