నరసాపురం: పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్లో దారుణం, పదో తరగతి విద్యార్థిపై సహ విద్యార్థి కుటుంబ సభ్యులు అధ్యాపకుల ముందే దాడి
నరసాపురం పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థి కవురు సాయిను సహవిద్యార్థి రమేష్ కుటుంబసభ్యులు (తండ్రి, అన్న, తాత) క్లాస్‌రూం లోనే అధ్యాపకుల ముందే అతి దారుణంగా దాడి చేశారు. వివరాల్లోకి వెళితే, నిన్న స్కూల్లో జరిగిన గొడవపై మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు ఉద్రిక్తతలు చెలరేగి ఈ దాడి జరిగిందని సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన సాయి క్లాస్‌లోనే స్పృహ కోల్పోయాడు. స్కూల్ వద్ద గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల మధ్య గొడవలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ రేచల్ స్పష్టం చేశారు.