భీమిలి: తగరపువలసలో యువకునిపై రౌడీ షీటర్ ల గ్యాంగ్ దాడి
తగరపువలసలో యువకుని పై రౌడీ షీటర్లు దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గుల్ల పవన్ కుమార్ వయసు 19 అలియాస్ కిట్టు పై రౌడీ షీటర్లు దాడి చేసారు. రౌడీ షీటర్ వినోద్, వెంకటేష్, 10మంది గ్యాంగ్ కలిసి పవన్ కుమార్ పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు రౌడీ షీటర్లు పాల్గొన్నట్లు సమాచారం. దాడి అనంతరం కుమార్ ను నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లినట్లు సమాచారం తెలుసుకున్న భీమిలి పోలీసులు ప్రణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై భీమిలి పోలీసులు విచారణ చేస్తున్నారు.