అసిఫాబాద్: అంగన్వాడి టీచర్లపై చిన్న చూపు చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం: అంగన్వాడి జిల్లా కోశాధికారి రాజేశ్వరి
రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందని అంగన్వాడి జిల్లా కోశాధికారి రాజేశ్వరి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ స్కూల్ లను ప్రారంభించి, అందులో ఒక ఆయాని, ఒక టీచర్ ను పెట్టడం జరుగుతుందని ఆమె ఆరోపించారు. ఆ టీచర్ కు ఇచ్చే జీతం మా అంగన్వాడి ఉద్యోగులకు ఇస్తే ఆ విద్యా బోధన మేమే చేస్తామని అన్నారు. అంగన్వాడి టీచర్ లను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. అంగన్వాడి టీచర్ లతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు.