గన్నేరువరం: తొలి ఏకాదశి సందర్భంగా కాసింపేట ప్రముఖ పుణ్యక్షేత్రం మానసా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహణ
మానసా దేవి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని కాసింపేట ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు మానసా దేవి ఆలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సుదర్శన చక్రానికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా గా భక్తులు అమ్మవార్ల దర్శనానికి తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 108 జంటనాగులకు శివలింగాలకు జలాభిషేకం నిర్వహించి సామూహిక సత్యనారాయణ వ్రతాలు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.