ప్రకాశం జిల్లా దర్శి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డిసెంబర్ 6వ తేదీ శనివారం జరిగే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని స్థానిక ప్రజా సంఘాల నాయకులు గురువారం విజ్ఞప్తి చేశారు. దర్శి ఏఎస్ఐ రాంబాబు వర్ధంతి కరపత్రాలను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయాలను, దళితుల హక్కుల సాధన కొరకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకులు మీడియాకు వెల్లడించారు.