అనంతపురం నగరంలోని భవాని నగర్ లో రామలక్ష్మమ్మ అనే అత్త పై ఆమె అల్లుడు నారాయణస్వామి బండరాయితో దాడి చేసి గాయపరిచిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.