ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా అందిన 443 అభ్యర్ధనలకు అనుమతులు జారీ: కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
Eluru, Eluru | Apr 2, 2024 జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా అందిన అభ్యర్ధనలలో ఇంతవరకూ 443 అభ్యర్ధనలకు అనుమతులు ఇవ్వటం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.