ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి : వెంకటగిరి సీఐ
వెంకటగిరి విశ్వోదయ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను వెంకటగిరి సీఐ ఏవీ రమణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. దుకాణాల వద్ద తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. టపాసులను ప్రజలు జాగ్రత్తగా కాల్చుకోవాలని తెలిపారు. అగ్నిమాపకాధికారి నారాయణ, ఎస్సై ఏడుకొండలు ఉన్నారు.