మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి నెల్లూరు బ్యారేజ్ కి ఎగు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దీంతో పెన్నా బ్యారేజ్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువైంది. నెల్లూరు నగరంలోని దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సాయంత్రం సమయంలో పెన్నా బ్యారేజ్ కి వచ్చి ఆహ్లాదంగా గడుపుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సంతోషంగా కుటుంబంతో పెన్నా బ్యారేజ్ అందాలను విక్షిస్తున్నారు.. బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పెన్నా బ్యారేజ్ వద్ద సందడి నెలకొంది.