బద్వేల్: పేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది - టీడీపీ సమన్వయకర్త రితేశ్ రెడ్డి
Badvel, YSR | Jul 15, 2025 కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ సమన్వయకర్త రితేశ్ రెడ్డి కాశినాయన మండలానికి చెందిన బాలయపల్లె, మిద్దెల గ్రామాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ సమన్వయకర్త రితేశ్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆరోగ్య భద్రత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పేదలకు అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులతో ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బసిరెడ్డి రవీంద్రారెడ్డి, పోలిరెడ్డి, క్రిష్ణారెడ్డి, జయరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.