సర్వేపల్లి: కూటమిపాలనలో రైతులకు గుండె కోత : రాజవోలుపాడులో మాజీ మంత్రి కాకాణి ఫైర్
మనుబోలు మండలం, వీరంపల్లి పంచాయతీ రాజవోలుపాడులో మాజీ మంత్రి కాకాణి పర్యటించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అయన మండిపడ్డారు. ఒకవైపు రైతులకు యూరియా దొరకక అవస్థలు పడటం, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో 90 శాతం పైగా కోతలు పూర్తయిన ఇప్పటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని గురువారం సాయంత్రం 5 గంటలకు మండిపడ్డారు