కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న పై మరో కేసు నమోదు, ఆందోళనలో వైసీపీ క్యాడర్
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. 2023లో.. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ ఇంటితోపాటు వాటర్ ప్లాంట్ పై దాడి చేశారని అభియోగాల నేపథ్యంలో.. వీరి చలపతి A1 ముద్దాయిగా ఉండగా.. A20 ముద్దాయిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన్ని అరెస్టు చేస్తారని టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు.