దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టే అంశంలో దృష్టి సారించాలని సిఐ శ్రీకాంత్ బాబు పోలీసు సిబ్బందికి సూచించారు. సోమవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సమావేశం నిర్వహించిన సీఐ శ్రీకాంత్ బాబు వివిధ అంశాలపై వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు అరికట్టడమే కాకుండా దొంగతనాలు నిర్మూలించే అంశంలో రాత్రి వేళలో గస్తిని ఏర్పాటు చేయాలన్నారు.