తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో వేడుకగా పౌర్ణమి గరుడ సేవ
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషతుడైన స్వామి వారు గరుడనిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసాను దాస ప్రాపర్టీకి తాను దాసుడనని తెలియజేత్తారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్యరూపాలైన రెక్కలతో విహరించే గరుడని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నారు.