శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున డిప్యూటీ ఈవో లోకనాథం దంపతులు,వేదపండితులు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో లోకనాథం దంపతులు, వేదపండితులకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు ట్రస్ట్ బోర్డు మెంబర్లు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్థానం ప్రధానర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు.