అప్పన్నవీడు అభయాంజనేయస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకారం పాల్గొన్న మంత్రి కొలుసు, ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి
Eluru Urban, Eluru | Sep 29, 2025
పెదపాడు మండలం అప్పన్నవీడు శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారకార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని నూతన చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు సహా కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన ట్రస్ట్ బోర్డు మరింత కృషి చేయాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.