చిట్యాల: పట్టణ కేంద్రంలో ట్రాక్టర్లను ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన లారీ
నల్గొండ జిల్లా, చిట్యాల పట్టణ కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల నుండి భువనగిరి వైపు వెళ్తున్న లారీ ముందుగా వెళ్తున్న ట్రాక్టర్లను ఓవర్టేక్ చేసే సమయంలో అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.