ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో పలు లాడ్జిలను గురువారం రాత్రి ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహకుల రిజిస్టర్ పరిశీలించి నూతన వ్యక్తులకు గదులను అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అనుమానస్పదంగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు గదులను అద్దెకు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు నిర్వాహకులను తీవ్రంగా హెచ్చరించారు.