ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
ఓజోన్ పొర ప్రపంచంలోని జీవ జాతికి రక్షణ కవచమని విద్యార్థులు, ఉపాధ్యాయులు నినదించారు. మంగళవారం ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండలం పాంచాలి లో జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం మధ్యాహ్నం మూడున్నరకు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ NGC క్లస్టర్ కోఆర్డినేటర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రసన్నకుమార్ అవగాహన కల్పించారు.