అదిలాబాద్ అర్బన్: దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదిలాబాద్ నవశక్తి దుర్గామాత ఆలయంలో పసుపు బండార్ కార్యక్రమం
దేవి నవరాత్రుల్లో భాగంగా ఆదిలాబాద్ నవశక్తి దుర్గామాత ఆలయంలో పసుపు బండార్ కార్యక్రమం నిర్వహించారు. పల్లకిలో అమ్మవారి ప్రతిమను ఉంచి స్వాములు పల్లకిని మోశారు. ఆలయ పీఠాధిపతి కిషన్ మహరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పల్లకీ సేవను ప్రారంభించారు. అనంతరం పసుపు బండర్ నిర్వహించారు. పసుపు చల్లుకుంటూ అమ్మవారి పాటలకు నృత్యాలు చేస్తూ భవానీలు అలరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది.