సూర్యాపేట: నేరేడుచర్ల లోని విద్యార్థులకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఐ రాజు ఎస్సై రవీందర్ నాయక్
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్లలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సిఐ రాజు ఎస్సై రవీందర్ నాయక్ శ్రీ విజయ దుర్గ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలను చేపట్టారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.