మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో అన్ని కార్యాలు సజావుగా జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసిఆర్ సీఎం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.