అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద బొలెరో వాహనం వరి కోత మిషన్ ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకెట్ల గ్రామానికి చెందిన మధు అనే బొలెరో డ్రైవర్ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.