ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లోని కొత్తపల్లి సమీపంలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించనున్నట్లు మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 8:30 గంటలకు వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడ పనులను పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలియజేశారు.