అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం లో గోదావరి వరద భారీగా తగ్గుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన వివరాలు దేవస్థానం ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి వరద నీరు భారీగా తగ్గుతుందని దీనివల్ల రోడ్లు, పొలాలు బయటకు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద వరద నీరు భారీగా తగ్గినట్లు చెప్పారు. ఆలయ సమీపంలో ఉన్న రోడ్డుపై నీరు తగ్గడంతో ప్రయాణాలకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతమంతా బురద మయంగా ఉండటం వల్ల ఇంకా భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేయడం లేదని తెలిపారు.