అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలను ఐటిడిఏ పిఓ కట్ట సింహాచలం తెలిపారు. ఏజెన్సీ ఏడు మండలాల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని, ఇందులో ప్రధానంగా సాగునీరు, తాగునీరు, రోడ్ల అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారని చెప్పారు. ఈ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు తెలియపరచి పరిష్కరిస్తామని పిఓ తెలిపారు. 64 దరఖాస్తులు వచ్చాయన్నారు.