పుట్టపర్తిలో జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి సూపర్ బజార్‌ను మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌పై కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పాత జీఎస్టీతోనే వినియోగదారులకు వస్తువులు విక్రయిస్తున్నారా అని ఆరా తీసి అక్కడ ఉన్న వినియోగదారులకు జీఎస్టీ మినహాయింపుపై వస్తువులు విక్రయించాలని తెలిపారు.