శ్రీ సత్యసాయి జిల్లాలో 232.2 మి.మీ వర్షపాతం నమోదు
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 232.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు కలెక్టరేట్ నుంచి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 32 మండలాల్లో వర్షం కురిసిందని చెప్పారు. అత్యధికంగా చిలమత్తూరు 21.4, గుడిబండ 12.6, తలపుల, ఎన్పీ కుంట, రామగిరి, పెనుకొండ, గోరంట్ల 12.4, పుట్టపర్తి 10.4, రోళ్ల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైందని వివరించారు.