మేడ్చల్: నాగోల్ లో అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్త
నాగోల్ లో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త తన భార్య గొంతు కోశాడు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వేణుగోపాల్ వివాహం జరిగింది. అదనపు కట్నం కావాలంటూ ఇటీవల భార్యను వేణుగోపాల్ వేధిస్తూ ఉండేవాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా అతడు మారలేదు. ఈ క్రమంలో భార్య గొంతు కోశాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.