ఇబ్రహీంపట్నం: ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది : ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ
శేర్లింగంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయం నిధి నుంచి మంజూరైన 2074500 రూపాయలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ 47 మంది లబ్ధిదారులకు ఆదివారం మధ్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.