జనసేన అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బెజవాడ దినేష్
పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్, విజయవాడలోని నోవోటెల్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను, ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు,ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను, మరియు శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి తో పాటు ఇతర ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పీలేరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి పై వారు చర్చించారు. జనసేన పార్టీని ప్రతి కార్యకర్త శ్రమతో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.