తణుకు: సజ్జాపురంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్బంధించి గాయపరిచి రూ. లక్ష దోచుకెళ్లిన ముసుగు దొంగ
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భందించి తీవ్రంగా గాయపరిచి రూ. లక్ష నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం తెల్లవారుజామున సుమారు ఏడు గంటలకు తణుకులో చోటుచేసుకుంది. తణుకు సజ్జాపురంలో జుపిటర్ ట్రేడర్స్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ముత్యాల వెంకటరావుపై గుర్తుతెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును దోచుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు