రాయదుర్గం: గోనబావి గ్రామంలో రెండు ఇళ్లలో చోరీలు
గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామం కొత్త కాలనీలో 2 ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలోని నగలను దొంగలు దోచుకెళ్లారు. మారెప్ప, చౌడప్ప వారివారి కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లకు తాళాలు వేసి కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు పనుల కోసం వలసవెళ్ళారు. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి సమయాల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలోని సుమారు 5 తులాల బంగారు ఉంగరాలు, చెవి కమ్మలు, గొలుసు దోచుకెళ్లారు. గోనబావి ఊరిలో నివాసం ఉంటున్న వారి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు తెలపడంతో ఎస్ఐ ఈశ్వరయ్య ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు చేపట్టారు.