మేడ్చల్: బంజారా హిల్స్ లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
42 శాతం రిజర్వేషన్లపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక కోసం బంజారాహిల్స్ లోని కలింగభవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ దేశంలో బ్రాహ్మణ, వైశ్యులతో సహా అన్ని కులాలకు రిజర్వేషన్లు అందుతున్నాయని, కాబట్టి మనం న్యూణ్యత భావనతో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.