అసిఫాబాద్: తుంపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలు సీజ్
అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను ఆసిఫాబాద్ పోలీసులు సీజ్ చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి గ్రామ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక కుప్పలు నిల్వ ఉంచారు. ఈ విషయంపై ఆసిఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మధ్యాహ్నం అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక కుప్పలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.