సంగారెడ్డి: కొండాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ పారితోష్ పంకజ్
వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కొండాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. రికార్డులు, పరిశుభ్రతను పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డుల మెయింటెనెన్స్ బాగా ఉందని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.