ఉదయగిరి: సత్యవొలు - ఆగ్రహారం మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న మీడతవాగు నిలిచిపోయిన రాకపోకలు
కొండాపురం మండలంలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. సత్యవోలు – అగ్రాహరం మధ్య మిడత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ప్రవాహం పెరగడంతో కావలి – కొండాపురం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నీటిమట్టం వేగంగా పెరుగుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.