కుప్పం: నడుమూరు ఘాట్ రోడ్డులో ప్రమాదం
కుప్పం మండలంలోని నడుమూరు ఘాట్ రోడ్డులో రెండు కంటైనర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. కుప్పం వైపు నుంచి తమిళనాడు వెళ్తున్న కంటైనర్‌ని ఎదురుగా తమిళనాడు వైపు నుంచి వస్తున్న మరో కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ కిషోర్ దేవ్ తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. నడుమూరు సమీపంలోని మోడల్ స్కూల్ మలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.