శంకర్పల్లి: శంకర్ పల్లి లో దొంగతనంగా భారీ గా బంగారం, వెండి ఆభరణాలు కోల్పోయిన కౌన్సిలర్ పార్సిని పరామర్శించిన ఎమ్మెల్యే సబిత
శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధ బాలకృష్ణ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగిన నేపథ్యంలో మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మంగళవారం నాడు వారిని పరామర్శించారు.ఈ సందర్భంగా వారి కుటుంభ సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో కూతురి పెళ్లి సందర్బంగా మెహందీ ఫంక్షన్ అనంతరం బంగారం పెట్టడానికి వెళ్లగా అందులో ఉన్న సుమారు రెండు కిలోల బంగారం, 80 తులాలు వెండి ఆభరణాలు, రెండున్నర లక్షల రూపాయల నగదు చోరీకి గురైందని రాధ బాలక్రిష్ణలు సబితా ఇంద్రారెడ్డికి వివరించారు